మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సలీం ఖురేషీ అరెస్ట్.. మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-13 05:56:39  IST  )

అన్ని రాష్ట్రాల పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సలీం ఖురేషీ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు.

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సలీం ఖురేషీ అరెస్ట్.. మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: అన్ని రాష్ట్రాల పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సలీం ఖురేషీ (Salim Qureshi) ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. ఇటీవల మూడు ప్రాంతాల్లో చోరీకి పాల్పడిన అతడిపై విశాఖపట్నం పోలీసులు (Vishakhapatnam Police) కేసు నమోదు చేశారు. అనంతరం విచారణలో భాగంగా కీలక ఆధారాలను సేకరించిన ఇన్వెస్టిగేషన్ టీమ్ నిందితుడిని మహారాష్ట్ర (Maharashtra)లో చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. అయితే, నిందితుడు సలీం ఖురేషీపై దేశ వ్యాప్తంగా 200లకు పైగానే కేసులు ఉన్నాయి. గతంలో ముంబై గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌ (Chota Rajan)తో పాటు రాజస్థాన్ ఎమ్మెల్యే నివాసాల్లో చోరీకి పాల్పడ్డాడు. ఈ మేరకు సలీం ఖురేషీని పోలీసులు ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Next Story