- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా ఉద్యోగి ఫొటోలు మార్ఫింగ్.. రాజ్‌భవన్‌లో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
తోటి మహిళ ఉద్యోగిని మార్ఫింగ్ ఫోటోలతో భయబ్రాంతులకు గురి చేసిన రాజ్‌భవన్ ఉద్యోగిని హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, సిటీ క్రైం: తోటి మహిళ ఉద్యోగిని మార్ఫింగ్ ఫోటోలతో భయబ్రాంతులకు గురిచేసిన రాజ్‌భవన్ ఉద్యోగిని పంజాగుట్ట పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. అయితే, అదే ఉద్యోగి ఇదే వారంలో రెండు సార్లు అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. రాజ్‌భవన్‌లో అవుట్‌సోర్సింగ్ విధానంలో హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ తోటి మహిళా ఉద్యోగికి సంబంధించి కొన్ని మార్ఫింగ్ ఫోటోలను తనే తయారు చేసి పంపాడు. తనకు ఎవరో ఆ ఫోటోలను పంపిస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలని ఆమెకు తెలిపాడు. అదేవిధంగా ఆ మార్ఫింగ్ ఫోటోలు సదరు మహిళా ఉద్యోగి సిస్టమ్‌కు కూడా వస్తాయని భయభ్రాంతులకు గురి చేశాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆ మార్ఫింగ్ ఫోటోలను శ్రీనివాసే పంపించాడని తేల్చి వారం క్రితం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
కాగా, విధుల నుంచి సస్పెండ్ అయిన శ్రీనివాస్ రెండు రోజుల క్రితం బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈనెల 14న అర్ధరాత్రి రాజ్‌భవన్ వద్ద ఉన్న సెక్యూరిటీని మభ్యపెట్టి లోపలికి వెళ్లాడు. మార్ఫింగ్ ఫొటోలకు సంబంధించి సాక్ష్యాధారాలను చెరిపేసేందుకు కంప్యూటర్‌లో ఉన్న హార్డ్ డిస్క్‌లను ఎత్తుకెళ్లాడు. దీంతో రాజభవన్‌లోని ఐటీ మేనేజర్, శ్రీనివాస్‌పై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మరోసారి రంగంలోకి దిగిన పోలీసులు చోరీకి పాల్పడింది హార్డ్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ అని సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఈ మేరకు నిందితుడి అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడి నుంచి హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారం వ్యవధిలోనే శ్రీనివాస్ రెండోసారి జైలుకు వెళ్లాడు.






