మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు: మరోసారి నిందితుల సిట్ కస్టడీ పొడిగింపు

by Kema Shiva Kumar |

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను సిట్ అధికారులు మరోసారి 4 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు.

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు: మరోసారి నిందితుల సిట్ కస్టడీ పొడిగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, వ్యాపారవేత్త నమిత్ శర్మలను మరోసారి సిట్ (SIT) అధికారులు కస్టడీ విచారణ చేపట్టారు. డ్రగ్స్ సప్లై నెట్‌వర్క్‌తో ఉన్న సంబంధాల గురించి మరిన్ని వివరాలు సేకరించేందుకు సిట్ చర్యలు చేపట్టింది. ఉప్పరపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతితో వీరిని నాలుగు రోజుల పాటు విచారించనున్నారు.చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ముగ్గురిని బుధవారం సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయంలో వీరిని విచారించారు. మరో మూడు రోజుల పాటు వీరి విచారణ కొనసాగనుంది. విచారణ సమయంలో నిందితులతో పాటు వారి న్యాయవాదులు కూడా హాజరు కావచ్చని కోర్టు స్పష్టం చేసింది.

Next Story