- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: రాష్ట్రంలో సంచలనం.. గంజాయి తీసుకుంటూ పట్టుబడిన MLA కొడుకు
కడప జిల్లాకు చెందిన జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. గంజాయి(Marijuana) తీసుకుంటూ ఎమ్మెల్యే కుమారుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడలో శనివారం ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాకు చెందిన జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి(MLA Adinarayana Reddy) కుమారుడు సుధీర్ రెడ్డి(Sudheer Reddy) గంజాయి తీసుకుంటూ దొరికిపోయారు. అదుపులోకి తీసుకున్న అనంతరం గంజాయి టెస్టులు నిర్వహించగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో సుధీర్ రెడ్డిని స్థానిక పోలీస్ స్టేసన్‌కు తరలించి విచారించారు. అనంతరం డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ సుధీర్ రెడ్డిపై రెండు డ్రగ్స్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మరోవైపు.. న్యూఇయర్ వేళ ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఈగల్ బృందం సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో డ్రగ్స్ తీసుకుంటూ ఎనిమిది మంది పోలీసులకు చిక్కారు. మొత్తం 14 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. 8 మందికి పాజిటివ్ వచ్చింది. అందరినీ అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.






