TG: డబ్బులు కావాలని ఎమ్మెల్యే మెసేజ్?

by Gantepaka Srikanth |

వృద్ధులు, మహిళలు, నిరక్షరాస్యులతో పాటు పోలీసులు, ప్రజా ప్రతినిధులు సైతం సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు.

TG: డబ్బులు కావాలని ఎమ్మెల్యే మెసేజ్?
X

దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరాలపై విస్తృత ప్రచారం చేస్తున్నా తగ్గడం లేదు. కొంత మంది దురాశను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ప్రతి రోజు కనీసం 10 సైబర్‌ మోసాలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వృద్ధులు, మహిళలు, నిరక్షరాస్యులతో పాటు పోలీసులు, ప్రజా ప్రతినిధులు సైతం సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. తెలంగాణలోని వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు(MLA Nagaraju) పేరుతో సైబర్ నేరగాళ్లు అటాక్ చేశారు. ఎమ్మెల్యే ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేశారు. తెలిసిన వాళ్లు, అభిమానులు, బంధువులకు ఫేక్‌బుక్ ద్వారా మెసేజులు చేసి డబ్బులు డిమాండ్ చేశారు. విషయం తెలిసి ఎమ్మెల్యే నాగరాజు అప్రమత్తం అయ్యారు. తన పేరుతో ఎవరు మెసేజ్ చేసినా స్పందించొద్దని వీడియో రిలీజ్ చేశారు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.

Next Story