- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLA గండ్ర సత్యనారాయణ PA అరెస్ట్: యువతిని మోసం చేసిన కేసులో రిమాండ్
యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పీఏ శ్రీనివాస్‌ను పోలీసుల అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పీఏ శ్రీనివాస్ చిక్కుల్లో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని మోసం చేయడమే కాకుండా, కులం పేరుతో దూషించిన కేసులో చిట్యాల పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కొంతకాలంగా శారీరకంగా వాడుకున్నాడు. అయితే, ఇటీవల ఆమెను కాదని మరో వివాహం చేసుకునేందుకు శ్రీనివాస్ సిద్ధమయ్యాడు. దీనిపై జ్యోతి అతడిని నిలదీయగా, పెళ్లికి నిరాకరించడమే కాకుండా కులం పేరుతో దూషిస్తూ, బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీనివాస్‌పై ఎస్సీ, ఎస్టీ (SC, ST) అట్రాసిటీ కేసుతో పాటు మోసం కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, ఇవాళ ఆయనను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ అరెస్ట్ కావడంతో నియోజకవర్గంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.






