చిరక్ స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

by Bhanu |

హైదరాబాద్‌ శేరిలింగంపల్లి ప్రాంతంలోని మియాపూర్‌లో స్కూల్ బస్సు బైక్‌ను ఢీకొట్టి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతుడు బీహెచ్‌ఈఎల్ ఎంఐజీకి చెందిన పారుపల్లి పవన్ కుమార్ (43) అని గుర్తించారు.

చిరక్ స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్‌ శేరిలింగంపల్లి ప్రాంతంలోని మియాపూర్‌లో స్కూల్ బస్సు బైక్‌ను ఢీకొట్టి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతుడు బీహెచ్‌ఈఎల్ ఎంఐజీకి చెందిన పారుపల్లి పవన్ కుమార్ (43) అని గుర్తించారు.

కుటుంబసభ్యుల కథనం ప్రకారం, పవన్ కుమార్ తన హోండా యూనికార్న్ బైక్‌ (టీఎస్15 ఎఫ్ఏ 9076) పై కొండాపూర్‌ వైపు నుండి మియాపూర్‌ వైపు వస్తుండగా, హఫీజ్‌పేట్ హీరో హోండా షోరూం వద్దకు రాగానే చిరక్ స్కూల్‌కు చెందిన బస్సు (టీఎస్ 07 యూహెచ్ 4907) అతడిని వేగంగా వెనక నుంచి ఢీకొట్టింది. బస్సును ఎన్.కె. నోహాన్ అనే డ్రైవర్ నడుపుతున్నాడు.

ఈ ఘటనలో పవన్ బైక్‌పై నుంచి పడి తీవ్ర గాయాలవల్ల అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ నోహన్ బస్సుతో సహా అక్కడినుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మృతుడికి భార్యతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌తో పాటు స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Next Story