- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లలో అపశృతి.. విద్యుత్ షాక్‌తో యువకుడు దుర్మరణం
విశ్వ సుందరి పోటీలకు హైదరాబాద్ (Hyderabad) మహా నగరం వేదిక కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: విశ్వ సుందరి పోటీలకు హైదరాబాద్ (Hyderabad) మహా నగరం వేదిక కాబోతోంది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ (Miss World Organization) నిర్వహించే ఈ పోటీలకు రాష్ట్ర పర్యాటక శాఖ (State Department of Tourism) ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మిస్ వరల్డ్ పోటీల ఓపెనింగ్ సెర్మనీ (Opening Ceremony) జరిగే గచ్చిబౌలి స్టేడియం (Gachibowli Stadium)లో ఇవాళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈవెంట్ సందర్భంగా ఫ్లైఓవర్ (Flyover) సమీపంలో ఎలక్ట్రిక్ పనులు చేస్తుండగా.. ఓ యువకుడు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా, మే 7 నుంచి 31 వరకు అంటే 28 రోజుల పాటు ప్రపంచ సుందరి పోటీలు కొనసాగుతాయని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ (Miss World Organization) తెలిపింది. మే 31న మిస్ వరల్డ్ ఫినాలే (Miss World Finale) ఉంటుంది. అందులో విజేతలైన వారు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు (జూన్ 2)న రాజ్‌భవన్ (Raj Bhavan)లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma), సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)లతో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు.






