మీర్జాగూడ బస్సు ప్రమాదం.. నాలుగు డెడ్‌బాడీలకు ముగిసిన పోస్ట్‌మార్టం

by Kema Shiva Kumar |

చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనతో రాష్ట్రం శోకసంద్రంలో మునిగింది.

మీర్జాగూడ బస్సు ప్రమాదం.. నాలుగు డెడ్‌బాడీలకు ముగిసిన పోస్ట్‌మార్టం
X

దిశ, వెబ్‌డెస్క్: చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనతో రాష్ట్రం శోకసంద్రంలో మునిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ప్రమాద స్థలంలో పోలీసులు చేపట్టిన సహాయక చర్యలు ముగిశాయి. ఈ మేరకు ఇప్పటికే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి.. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు వైద్యులు నాలుగు డెడ్‌బాడీలకు పోస్ట్‌మార్టం ప్రక్రియను పూర్తి చేశారు. వారిలో కర్నాటక రాష్ట్రంలో భానూర్‌కు చెందిన నాగమణి, గంగారం తండాకు చెందిన తారిబాయి, తాండూరుకు చెందిన నజీర్, మరొకరి మృతదేహాన్ని అధికారులు అంబులెన్స్‌లో స్వస్థలాలకు పంపేశారు.

Next Story