- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శారీరకంగా కలిసిన మైనర్లు.. గర్భం దాల్చిన బాలిక
జనరేషన్ గ్యాప్ అంటే ఏమో అనుకున్నాం.. కానీ మరీ ఇంత ఘోరంగా ఉంటుందనుకోలేదు. పైగా తల్లిదండ్రులు ప్రేమతో కావాల్సినవి అన్నీ కొనిస్తే మరీ అరాచకంగా తయారవుతున్నారు పిల్లలు. ఏ ఏజ్‌లో చేసే పనులు ఆ ఏజ్‌లో చేయకుండా.. వరస్ట్‌గా మారిపోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : జనరేషన్ గ్యాప్ అంటే ఏమో అనుకున్నాం.. కానీ మరీ ఇంత ఘోరంగా ఉంటుందనుకోలేదు. పైగా తల్లిదండ్రులు ప్రేమతో కావాల్సినవి అన్నీ కొనిస్తే మరీ అరాచకంగా తయారవుతున్నారు పిల్లలు. ఏ ఏజ్‌లో చేసే పనులు ఆ ఏజ్‌లో చేయకుండా.. వరస్ట్‌గా మారిపోతున్నారు. ఇలాంటిదే ఈ సంఘటన. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యారు.. ప్రేమ పేరుతో మీట్ అయ్యారు.. శారీరకంగా ఒక్కటయ్యారు. కానీ వీరిద్దరు కూడా మైనర్లు కావడం ఆందోళన కలిగించే విషయం. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా పట్టాభిపురం పీఎస్ పరిధిలోని కోబాల్ట్ పేటకు చెందిన బాలికకు 17 ఏళ్లు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మాయికి అదే ప్రాంతానికి చెందిన బాలుడు(17)తో ఆన్‌లైన్ పరిచయం ఏర్పడింది. తరుచుగా చాట్ చేస్తూ ప్రేమ పేరుతో దగ్గరయ్యారు. పలుమార్లు శారీరకంగా కలిశారు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో.. విషయం బయటకు వచ్చింది. దీంతో బాలిక కటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఈ న్యూస్ వైరల్ కావడంతో.. ఈ ఘటన ‘కోర్టు’ సినిమాను పోలి ఉందని కొందరు అంటుంటే.. తప్పు ఇద్దరు చేసినప్పుడు ఇద్దరిని శిక్షించాలి కదా.. బాలుడు కూడా పోక్సో కేసు ఎందుకు పెట్టకూడదు.. అని కామెంట్స్ చేస్తున్నారు.






