- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్‌తో అధికారి సహజీవనం.. అలా చేయమన్నాడని గొంతుకోసి చంపేసిన బాలిక
ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు, లివ్ ఇన్ రిలేషన్ షిప్ లు హత్యలకు దారితీస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు, లివ్ ఇన్ రిలేషన్ షిప్ లు హత్యలకు దారితీస్తున్నాయి. అలాంటి ఘటనలు ప్రతిరోజూ దేశ నలుమూలల్లో అనేకం వెలుగుచూస్తున్నాయి. తాజాగా.. మైనర్ తో సహజీవనం చేసిన అధికారి.. ఆమె చేతిలోనే హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో చోటుచేసుకుంది. బాలికతో సహజీవనం చేసిన ఇంజినీరింగ్ అధికారి.. ఆమెను గర్భం తీయించుకోవాలని ఒత్తిడి చేయడంతో.. ఈ ఘోరం జరిగింది.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఉన్నాయి. బిహార్ కు చెందిన సద్దామ్ అభాన్ పూర్ లో ఇంజనీరింగ్ అధికారిగా పనిచేస్తున్నాడు. అతను కొంతకాలంగా బిలాస్ పూర్ కు చెందిన 16 ఏళ్ల బాలికతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. విషయంపై ఇద్దరికీ తారాస్థాయిలో గొడవ జరిగింది. అబార్షన్ చేయించుకోవాలని సద్దామ్ పట్టుపట్టగా.. అందుకు బాలిక ససేమిరా ఒప్పుకోలేదు. ఈనెల 28న అవోన్ లాడ్జ్ లో సద్దామ్, బాలిక కలుసుకోగా.. తనను పెళ్లి చేసుకోవాలని బాలిక డిమాండ్ చేసింది.
పెళ్లికి ఒప్పుకోని సద్దామ్.. కడుపు తీయించుకోవాలని లేదంటే చంపేస్తానని కత్తితో బాలికను బెదిరించాడు. రాత్రికి సద్దామ్ నిద్రపోగా.. అదే కత్తితో బాలిక అతడి గొంతుకోసి చంపేసింది. అనంతరం బిలాస్ పూర్ లోని తన ఇంటికి వెళ్లి తల్లికి జరిగిన విషయం చెప్పింది. వెంటనే బాలికను తీసుకుని ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లగా.. పోలీసులు సద్దామ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బాలికను విచారిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం హత్య జరిగిందా లేక క్షణికావేశంలో బాలిక అలా చేసిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.






