- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏం కష్టమొచ్చిందో.. ప్రేయసితో వీడియో కాల్ మాట్లాడుతూ మైనర్ ఆత్మహత్య
17 ఏళ్ల మైనర్.. ప్రేయసితో వీడియో కాల్ మాట్లాడుతూ.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: అసలు ఎటుపోతుంది నేటి యువత. చిన్న చిన్న కారణాలకే, తెలిసీ తెలియని వయసులో పుట్టే వ్యామోహాన్ని ప్రేమ అనుకుని చంపడం, చనిపోవడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా 17 ఏళ్ల మైనర్.. ప్రేయసితో వీడియో కాల్ మాట్లాడుతూ.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బోడుప్పల్ అయ్యప్పస్వామి ఆలయ సమీపంలో నివాసం ఉంటున్న ప్రైవేటు ఉద్యోగి కుమారుడు (17) ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో చదువుతున్నాడు. మేడిపల్లిలోని ఓ కార్ల షోరూమ్లో ప్రస్తుతం ప్రాక్టికల్ ట్రైనింగ్ లో ఉన్నాడు.
ఫిబ్రవరి 5వ తేదీన రాత్రి అతని తల్లిదండ్రులు షాపింగుకు వెళ్లగా.. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు. దీంతో తాను ప్రేమిస్తున్న అమ్మాయికి వీడియో కాల్ చేసి మాట్లాడుతూనే.. ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకున్నాడు. భయపడిన ఆమె వెంటనే అతని ఫ్రెండ్స్ కు ఫోన్ చేసిచెప్పగా.. వారంతా బాలుడి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఉరికి వేలాడుతూ కనిపించడంతో హుటాహుటిన సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం (ఫిబ్రవరి 6) బాలుడు మరణించడంతో కుటుంబంలో, ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. స్నేహితులు, తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి సూసైడ్ కు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి ఆత్మహత్యకు ప్రేమ కారణమా ? లేక వేరే కారణాలేవైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.






