- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
by Ajay Maddhiboyina |
మేడారం మహాజాతరకు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు పోటెత్తుతున్నారు. వాహనాలు భారీగా వస్తుండటంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా అక్కడక్కడా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: మేడారం మహాజాతరకు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు పోటెత్తుతున్నారు. వాహనాలు భారీగా వస్తుండటంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా అక్కడక్కడా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నేడు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర బ్రిడ్జి వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. హైదరాబాద్ నుండి భక్తులు మేడారం జాతరకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదే సమయంలో మంత్రి సీతక్క సైతం మేడారం వెళుతుండగా కారు ప్రమాదాన్ని చూసి ఆగిపోయారు. క్షతగాత్రులను పరామర్శించి వారికి ప్రత్యామ్నాయ వాహనాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు.
Next Story






