- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండుగపూట మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం
సంక్రాంతి(Sankranti) పండుగ వేళ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy)కి భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి(Sankranti) పండుగ వేళ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy)కి భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆదివారం రాత్రి వరంగల్ నుండి ఖమ్మం వైపునకు వస్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒకేసారి పేలాయి. దీంతో కారు కంట్రోల్ తప్పింది. ఈ సమయంలో డ్రైవర్ చాకచఖ్యంతో వ్యవహరించడంతో పెను ముప్పు తప్పింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం(Tirumalayapalem) వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి పొంగులేటికి ఏం జరుగకపోవడంలో ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు. ఆయనతో కారులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






