పాకిస్థాన్‌కు సైనిక రహస్యాలు లీక్.. IAF సివిలియన్ ఉద్యోగి అరెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-23 05:16:05  IST  )

పాకిస్థాన్‌కు భారత వైమానిక దళ రహస్యాలను చేరవేస్తున్న అస్సాంలోని చబువా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఉద్యోగి సుమిత్ కుమార్‌ను రాజస్థాన్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

పాకిస్థాన్‌కు సైనిక రహస్యాలు లీక్.. IAF సివిలియన్ ఉద్యోగి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత వైమానిక దళానికి (IAF) చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ (Pakistan) హ్యాండ్లర్లకు చేరవేస్తున్నాడనే ఆరోపణలపై ఓ సివిలియన్ ఉద్యోగిని రాజస్థాన్, ఎయిర్‌ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)కు చెందిన 36 ఏళ్ల సుమిత్ కుమార్ (Sumit Kumar) అస్సాంలోని చబువా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)గా పనిచేస్తున్నాడు. దాదాపు 2023 నుంచి పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో టచ్‌లో ఉన్న సుమిత్ డబ్బు కోసం భారత సైనిక రహస్యాలను వారికి విక్రయిస్తున్నట్లుగా విచారణలో తేలింది. ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల మోహరింపు, మిస్సైల్ సిస్టమ్స్‌తో పాటు అస్సాంలోని చబువా, రాజస్థాన్‌లోని బికనీర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లకు సంబంధించిన కీలక అధికారుల వివరాలను సోషల్ మీడియా ద్వారా పాక్ హ్యండ్లర్లకు చేరవేసినట్లుగా అధికారులు గుర్తించారు.

కాగా, ఈ ఏడాది జనవరిలో జైసల్మేర్‌లో ఝబ్రారామ్ (Jhabraram) అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా.. అతడి విచారణలో సుమిత్ కుమార్ పేరు బయటకు వచ్చింది. దీంతో నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ వర్గాలు పక్కా ఆధారాలతో అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం సుమిత్ కుమార్‌ను జైపూర్‌కు తరలించి ‘అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్-1923’ కింద కేసు నమోదు చేశారు.

ఎర్రకోట పేలుడు కేసు: హంద్వారాలో ఎన్ఐఏ సోదాలు.. 11కు చేరిన అరెస్ట్‌ల సంఖ్య

Next Story