బాబాపూర్ చెరువులో వలస కూలి జాలరి మృతి

by Batti.Sumithra |

చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు రాజమండ్రికి చెందిన వలస కూలి గోవింద్ అనే వ్యక్తి మృతి చెందాడు.

బాబాపూర్ చెరువులో వలస కూలి జాలరి మృతి
X

దిశ, లక్ష్మణచాంద : చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు రాజమండ్రికి చెందిన వలస కూలి గోవింద్ అనే వ్యక్తి మృతి చెందాడు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం బాబాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రతి సంవత్సరం రాజమండ్రికి చెందిన కొందరు జాలర్లు తెలంగాణకు వలస వచ్చి వేసవి కాలంలో చేపల వేట చేపడుతుంటారు. ఇదే క్రమంలో ఆదివారం బాబాపూర్ పెద్ద చెరువులో రాజమండ్రికి చెందిన సుమారు 15 మంది వలస కూలీలు కలిసి చేపలు పడుతున్నారు. ఈ సమయంలో మధ్యాహ్నం సుమారు 3:30 గంటల ప్రాంతంలో నందిపల్లి గోవింద్ ( 34 ) అనే వ్యక్తి కాలికి వల చిక్కుకోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి మేనమామ ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రావణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story