క్షమాపణలు కోరుతున్నాం: ఐ-బొమ్మ

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-17 11:14:47  IST  )

కొత్త సినిమాలు, ఓటీటీ వేదికల్లోని కంటెంట్‌ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ఐ-బొమ్మ ప్రధాన నిందితుడు ఇమ్మడి రవి(40)ని ఎట్టకేలకు హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు(Hyderabad Cybercrime Police) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

క్షమాపణలు కోరుతున్నాం: ఐ-బొమ్మ
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త సినిమాలు, ఓటీటీ వేదికల్లోని కంటెంట్‌ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ఐ-బొమ్మ ప్రధాన నిందితుడు ఇమ్మడి రవి(40)ని ఎట్టకేలకు హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు(Hyderabad Cybercrime Police) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐ-బొమ్మ, బప్పం, ఐ-విన్, బప్పం టీవీ పేర్లతో వెబ్‌సైట్‌లు రూపొందించి కొన్నేళ్లుగా సినిమాను పైరసీ చేస్తున్నారు. తాజాగా అతన్ని అదుపులోకి తీసుకొని నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపర్చగా.. రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాజాగా ఐ-బొమ్మ వెబ్‌సైట్(i-Bomma Website) నుంచి అధికారికంగా ఓ మెసేజ్ రిలీజ్ చేశారు. ‘‘ఇటీవల జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసనే అనుకుంటున్నాం. మొదటి నుంచి మాకు అనేకమంది విశ్వసనీయ అభిమానులు ఉన్నారు.. ఏదేమైనా, మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం.. మా సేవలను నిలిపివేస్తున్నందుకు చింతిస్తున్నాం.. అందుకు క్షమాపణలు కోరుతున్నాం’’ ఐ-బొమ్మ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.




Next Story