మెల్‌బోర్న్‌లో రూ. 100కోట్లు చోరీ ముఠా గుట్టురట్టు.. 19 మంది అరెస్ట్..

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-17 13:56:16  IST  )

‘ఆపరేషన్ సూపర్‌నోవా’.. మెల్ బోర్న్ పోలీసులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్. దాదాపు రూ. 100కోట్ల చోరీకి పాల్పడ్డ ముఠా గుట్టురట్టు చేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నడుస్తుండగా.. ఇప్పటి వరకు 19మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇండియన్ మూలాలకు

మెల్‌బోర్న్‌లో రూ. 100కోట్లు చోరీ ముఠా గుట్టురట్టు.. 19 మంది అరెస్ట్..
X

దిశ, వెబ్ డెస్క్ : ‘ఆపరేషన్ సూపర్‌నోవా’.. మెల్ బోర్న్ పోలీసులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్. దాదాపు రూ. 100కోట్ల చోరీకి పాల్పడ్డ ముఠా గుట్టురట్టు చేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నడుస్తుండగా.. ఇప్పటి వరకు 19మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇండియన్ మూలాలకు చెందినవారు కూడా ఉన్నారు. ఐదు నెలలుగా ఓ గ్రూప్ సూపర్ మార్కెట్లు, రిటైల్ స్టోర్స్‌ను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతుంది. ఖరీదైన వస్తువులను దొంగలిస్తుంది. బేబీ ఫార్ములా, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు, మెడిసిన్స్‌, విటమిన్ ట్యాబ్లెట్స్ వంటి వాటిని కొట్టేసి.. అక్రమంగా అమ్ముకుంటోంది. భారీ లాభాలను సంపాదిస్తుంది.

దీంతో ఈ ముఠా ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు, ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్, రిటైల్ కంపెనీల సహకారంతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. మునుపటితో పోలిస్తే రిటైల్ చోరీ కేసుల్లో 38శాతం అధికం కాగా వీటిల్లో ఈ ముఠా చాలా యాక్టివ్‌గా ఉంది. మొత్తానికి పందొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీరిలో 21-54 ఏళ్ల మధ్య ఉన్న పురుషులు, ఓ మహిళ ఉన్నట్లు తెలిపారు. మరింత మందిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఇది నార్మల్ చోరీ కాదని ఒక సిస్టమాటిక్ క్రిమినల్ సిండికేట్ అని ఇన్వెస్టిగేషన్‌లో తేలిందన్నారు.

Next Story