మెకానికల్ ఫెయిల్యూర్.. పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-22 02:59:21  IST  )

గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన ఘటన ఉత్తరప్రదేశ్ మథురా జిల్లాలోని అజ్హై, బృందావన్ రోడ్ స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

మెకానికల్ ఫెయిల్యూర్.. పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు
X

దిశ, వెబ్‌డెస్క్: గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురా జిల్లాలోని అజ్హై, బృందావన్ రోడ్ స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆగ్రా (Agra)-ఢిల్లీ (Delhi) మార్గంలో వెళ్తున్న కోల్ లోడెడ్ గూడ్స్ రైలు ఛటికార (Chatikara) వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో మొత్తం ట్రైన్‌లోని 13 బోగీలు ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ పరిణామంతో ఆ రూట్‌లోని 34 రైళ్లు అలస్యంగా నడుస్తున్నాయి. అయితే, మెకానికల్ ఫెయిల్యూర్ (హాట్ ఆక్సిల్) సమస్య కారణంగా ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఇదే ప్రాంతంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. తాజాగా గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో మొత్తం మూడు ట్రాక్‌లు బ్లాక్ కాగా.. నాలుగో ట్రాక్‌పై ట్రైన్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇక మథురా రైల్వే స్టేషన్‌లో వేలాది ప్రయాణికులు ట్రైన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు.

Next Story