- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోన్ యాప్ వేధింపులు.. MBA విద్యార్థి సూసైడ్
లోన్ యాప్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దిశ, వెబ్‌డెస్క్: లోన్ యాప్ వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా వడ్డాది మాడుగుల గ్రామానికి చెందిన మహమ్మద్ బషీర్ (22) కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కొద్దిరోజుల క్రితం అతను ఒక లోన్ యాప్ లో అప్పు తీసుకున్నాడు. ఆ అప్పును తిరిగి చెల్లించకపోవడంతో.. షరా మామూలుగా యాప్ నిర్వాహకులు తీవ్రంగా వేధించారు. అప్పు తిరిగివ్వకపోతే ఫేక్ ఫొటోలు, మార్ఫ్డ్ వీడియోలను వైరల్ చేస్తామని బెదిరించడంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. లోన్ యాప్ ఇచ్చే ఆఫర్లకు ఆకర్షితులై లోన్లు తీసుకోవద్దని పోలీసులు యువతను పదే పదే హెచ్చరిస్తున్నా.. ఎలాగైనా ఆ లోన్ తీర్చేయచ్చన్న ధీమాతో లోన్ యాప్స్ లో డబ్బు తీసుకుంటున్నారు. కొన్ని లోన్ యాప్స్ వారి అవసరాన్ని అవకాశంగా తీసుకుని ఇవ్వాల్సిన దానికంటే రెండు, మూడింతలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఇలాంటి లోన్ యాప్స్ ను బ్యాన్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.






