- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో భారీ చోరీ.. 2 కిలోల గోల్డ్, రూ.3 కోట్ల నగదు కొట్టేసిన కేటుగాళ్లు
పసిడి (Gold) రేటు పరుగులు పెడుతోన్న వేళ నగరంలో భారీ దోపిడీ కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి కాచిగూడ (Kachigua) ప్రాంతానికి చెందిన హేమరాజ్ (Hemaraj) బంగారం వ్యాపారం చేస్తున్నాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: పసిడి (Gold) రేటు పరుగులు పెడుతోన్న వేళ నగరంలో భారీ దోపిడీ కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి కాచిగూడ (Kachigua) ప్రాంతానికి చెందిన హేమరాజ్ (Hemaraj) బంగారం వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వారి ఇంట్లోనే పని చేస్తున్న నేపాల్ గ్యాంగ్ (Nepal Gang) హేమరాజ్ (Hemaraj) దంపతులకు చాకచక్యంగా నమ్మించి మత్తు మందు ఇచ్చారు. అనంతరం వారు స్పృహ కోల్పోయాక ఇంట్లోని నగదు (Cash), నగల (Jewelry)తో అక్కడి నుంచి ఉడాయించారు. అనంతరం బాధితుడు హేమరాజ్ లబోదిబోమంటూ కాచిగూడ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ దోపిడీకి సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






