Sattupalli: సింగరేణి క్వార్టర్స్‌లో భారీ చోరీ

by Gantepaka Srikanth |

సత్తుపల్లి పట్టణం సింగరేణి కాలరీస్ క్వార్టర్స్‌లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది.

Sattupalli: సింగరేణి క్వార్టర్స్‌లో భారీ చోరీ
X

దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణం సింగరేణి కాలరీస్ క్వార్టర్స్‌లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. సింగరేణి ఉద్యోగులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. సత్తుపల్లి పట్టణ శివారులో సింగరేణి కాలరీస్ ఉద్యోగులు సదుపాయం నిమిత్తం నిర్మించిన పీవీఎన్ రావు సెంటినరీ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి 3 గంటల సమయంలో ముసుగు ధరించి దొంగలు క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని.. దాదాపు ఆరు ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఆరు ఇళ్లలో కలిపి సుమారు రూ.51 లక్షల 80 వేలు విలువ గల సొత్తు చోరీ చేసినట్లు పోలీసులు అంచనా వేశారు. ఈ విషయం తెలిసిన కల్లూరు ఏసీపీ రఘు, పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. చోరీకి పాల్పడిన ముగ్గురు వ్యక్తులుగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story