- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HCUలోని సీఆర్ రావు ఇన్‌స్టిట్యూట్‌లో భారీ చోరీ.. ఏకంగా 50 ల్యాప్‌టాప్‌లు మాయం
గచ్చిబౌలి (Gachibowli)లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) ప్రాంగణంలో ఉన్న ప్రతిష్టాత్మక సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ (C.R.Rao Advanced Institute)లో భారీ చోరీ జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: గచ్చిబౌలి (Gachibowli)లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) ప్రాంగణంలో ఉన్న ప్రతిష్టాత్మక సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ (C.R.Rao Advanced Institute)లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇన్‌స్టిట్యూట్‌లోకి చొరబడి సుమారు రూ.25 లక్షల విలువైన 50 ల్యాప్‌టాప్‌లను ఎత్తుకెళ్లారు. దుండగులు పక్కా ప్లాన్‌తో ఈ చోరీకి పాల్పడ్డారు. ఇన్‌స్టిట్యూట్‌లోని ఓ క్లాస్ రూమ్ కిటికీ గ్రిల్స్‌ను అత్యంత చాకచక్యంగా తొలగించి లోపలికి ప్రవేశించారు. అక్కడ ఉన్న ల్యాప్‌టాప్‌లన్నింటినీ సేకరించి, బయట సిద్ధంగా ఉంచుకున్న కారులో వేసుకుని పరారయ్యారు.
కాగా, ఉదయం విషయం వెలుగులోకి రావడంతో ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా దొంగలు ల్యాప్‌టాప్‌లను కారులో తరలిస్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. అయితే, యూనివర్సిటీ వంటి కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో ఈ స్థాయిలో చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వేలిముద్రలను సేకరించింది. సీసీటీవీ ఆధారంగా కారు నంబర్చ, నిందితుల ఆచూకీ కోసం గచ్చిబౌలి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.






