ఆధ్యాత్మికత ముసుగులో భారీ దోపిడీ.. బాబా అశోక్ ఖారత్‌ను అరెస్ట్ చేసిన ఈడీ

by Kema Shiva Kumar |

తాను సాక్షాత్తూ శివుడి అవతారమని నమ్మించి అమాయక ప్రజల నుంచి రూ.కోటోట్లు ససూలు చేసిన రూపాయల వసూళ్లకు పాల్పడిన దొంగ బాబా అశోక్ ఖారత్ అలియాస్ ‘కెప్టెన్’ను అరెస్ట్ చేసిన ఈడీ!

ఆధ్యాత్మికత ముసుగులో భారీ దోపిడీ.. బాబా అశోక్ ఖారత్‌ను అరెస్ట్ చేసిన ఈడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆధ్యాత్మికత, మతపరమైన ఆచారాల ముసుగులో వసూళ్లు (Extortion), మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వయం ప్రకటిత దొంగ బాబా అశోక్ ఖారత్‌ (Ashok Kharat)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయనకు ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ (PMLA) కోర్టు అతనికి మే 26 వరకు ఈడీ కస్టడీ విధించింది. అయితే, ఈ ఏడాది మార్చిలో నాసిక్ పోలీసులు ఓ మహిళపై అత్యాచారం, మతపరమైన ఆచారాల పేరుతో పలువురిని దోపిడీ చేసినందుకు అశోక్ ఖారత్‌ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో మనీలాండరింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అశోక్ ఖారత్ తనను తాను శివుడి అవతారంగా చెప్పుకుంటూ భక్తులను నమ్మించేవాడు. కేవలం ఒకే ఒక్క బాధితుడి నుంచి ఏకంగా రూ.5.62 కోట్లను వసూలు చేసి, ఆ డబ్బుతో లగ్జరీ మెర్సిడెస్ కారు, విదేశీ పర్యటనలు, అమెరికాలో విలాసవంతమైన వైద్య చికిత్స, ఫామ్‌హౌస్‌లను కట్టినట్లగా చేసినట్లు ఈడీ గుర్తించింది.

బినామీ ఖాతాల‌తో మనీలాండరింగ్..

అయితే, బాబా అశోక్ కారత్ తన ఆర్థిక అక్రమాలు బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు. వేరే వారి పేర్లతో ప్రాక్సీ, బినామీ బ్యాంక్ ఖాతాలు, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలను తెరిచి, బాధితుల నుంచి వసూలు చేసిన బ్లాక్ మనీని ఆయా ఖాతాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Fixed Deposits)గా మార్చి విత్‌డ్రా చేశాడని తేలింది. ఈడీ దాడుల్లో రూ.13.92 కోట్ల నగదు, 5,500 అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.5.11 లక్షలు, రూ.1.12 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, రూ.2.25 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, విలాసవంతమైన మెర్సిడెస్ బెంజ్ కారు సీజ్ చేశారు.

Next Story