- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగర శివారులో భారీ అగ్ని ప్రమాదం.. ప్లాస్టిక్ స్క్రాప్ యూనిట్లో ఎగసిపడిన మంటలు
నగర శివారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

దిశ, వెబ్‌డెస్క్: నగర శివార్లలోని పహాడీషరీఫ్ (Pahad Sharif) పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జల్పల్లి, బాలాజీ నగర్ పరిసర ప్రాంతంలో ఉన్న ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్ (Plastic Scrap Godown)లో మంగళవారం హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ సామాగ్రి కావడంతో మంటలు చాలా వేగంగా యూనిట్ అంతటా వ్యాపించాయి. ప్రమాద స్థలం నుంచి ఆకాశమంత ఎత్తున దట్టమైన నల్లటి పొగ రావడంతో బాలాజీ నగర్, చుట్టుపక్కల నివాసాలు ఉండే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణభయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
రంగంలోకి ఫైర్ టెండర్లు..
అయితే, ప్రమాదంపై స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ టెండర్లు (Fire Tenders), పహాడీషరీఫ్ పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో స్పందించడంతో భారీ ముప్పు తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందా.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయ అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఆస్తి నష్టంపై వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.






