- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: అసోంలో భారీ అగ్ని ప్రమాదం.. 150 దుకాణాలకు వ్యాపించిన మంటలు
by Satheesh |
అసోం రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జోర్హాట్‌లోని చౌక్ బజార్‌లోని ఓ బట్టల దుకాణంలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: అసోం రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జోర్హాట్ జిల్లా చౌక్ బజార్‌లోని ఓ బట్టల దుకాణంలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ దుకాణం నుండి అగ్ని జ్వాలలు ఉవ్వెత్తున్న ఎగసిపడటంతో పక్కనున్న 150 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దుకాణాలు వరుసగా ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






