బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 13 మంది సజీవదహనం

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-21 14:14:24  IST  )

కేరళ రాష్ట్రంలోని త్రిసూర్‌లో మంగళవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 13 మంది సజీవదహనం
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ రాష్ట్రంలోని త్రిసూర్‌లో మంగళవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోగా, 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ప్రసిద్ధ 'త్రిసూర్ పూరం' ఉత్సవాల కోసం బాణసంచా తయారు చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. మధ్యాహ్నం సుమారు 3:30 గంటలకు ఒక్కసారిగా పేలుళ్లు మొదలయ్యాయి. చాలా సేపటి వరకు పేలుళ్లు కొనసాగడంతో, సహాయక చర్యలు చేపట్టడం రెస్క్యూ సిబ్బందికి కష్టతరంగా మారింది. ఇప్పటివరకు అందిన అనధికారిక సమాచారం ప్రకారం 13 మంది వ్యక్తులు మరణించగా, 40 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ యూనిట్‌లో సుమారు 60 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు కార్మికులు స్వల్ప గాయాలతో తప్పించుకోగలిగారు. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుళ్లు తగ్గుముఖం పట్టాక సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.

Next Story