నాతో పడుకుంటావా.. నీ భర్తను చంపేయాలా? యువకుడి వేధింపులకు వివాహిత బలి!

by Ajay Maddhiboyina |

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ కామాందుడి వేధింపులకు వివాహిత బలైంది. ఈ ఘటన కృష్ణాజిల్లా, పామర్రు నియోజవర్గం, కొమరువోలు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్పీ కాలనీలో ప్రవీణ్ రాజు, వసంత దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరగ్గా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

నాతో పడుకుంటావా.. నీ భర్తను చంపేయాలా? యువకుడి వేధింపులకు వివాహిత బలి!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ కామాందుడి వేధింపులకు వివాహిత బలైంది. ఈ ఘటన కృష్ణాజిల్లా, పామర్రు నియోజవర్గం, కొమరువోలు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్పీ కాలనీలో ప్రవీణ్ రాజు, వసంత దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరగ్గా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే అదే కాలనీకి చెందిన పవన్ అనే యువకుడు వసంతను కోరిక తీర్చాలంటూ కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలు ఇదే విషయాన్ని కుటుంబ పెద్దలకు చెప్పగా పిలిచి మందిలించారు.

అయినప్పటికీ యువకుడి మార్పు రాకపోగా కోరిక తీర్చకపోతే నీ భర్తను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. తన వెంటపడవద్దని ఎంత చెప్పనా వినకపోవడంతో వసంత లోలోపల కుమిలిపోయింది. వేదింపులు ఆపకపోవడంతో చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని అరెస్ట్ చేయాలని కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డెడ్ బాడీతో గ్రామంలో ఆందోళనకు దిగారు. దీంతో పవన్ ను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. వంసత మృతికి కార‌ణ‌మైన వాడిని క‌ఠినంగా శిక్షించాల‌ని గ్రామ‌స్థులు సైతం డిమాండ్ చేస్తున్నారు.

Next Story