- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాఖీ కట్టేందుకు వెళ్లి వివాహిత మిస్సింగ్
మండల పరిధిలోని ఏదుట్ల గ్రామానికి చెందిన ద్యావర చంద్రకళ హైదరాబాదులో ఉంటున్న తన అన్నలకు రాఖీ కట్టి వస్తానని చెప్పి కనిపించకపోయింది.

X
దిశ, గోపాల్‌పేట: మండల పరిధిలోని ఏదుట్ల గ్రామానికి చెందిన ద్యావర చంద్రకళ హైదరాబాదులో ఉంటున్న తన అన్నలకు రాఖీ కట్టి వస్తానని చెప్పి కనిపించకపోయింది. ఎస్సై నరేష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు ఏదుట్ల గ్రామానికి చెందిన ద్యావర రాముడుతో 15 సంవత్సరాల క్రితం చంద్రకళతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. అయితే, ఈనెల 7న ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాదులో ఉన్న తన అన్నలకు రాఖీ కట్టి వస్తానని భర్తతో చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. 13న భర్త రాముడు తన అత్తకు ఫోన్ చేసి తన భార్య చంద్రకళను ఎందుకు ఇంటికి పంపలేదని అడగ్గా చంద్రకళ హైదరాబాదుకు రాలేదని సమాధానం చెప్పింది. ఈ మేరకు భర్త రాముడు, చంద్రకళ కనిపించడం లేదని గోపాల్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై నరేశ్ కుమార్ తెలిపారు.
Next Story






