- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొగుడు వద్దు.. ప్రియుడే కావాలి! పోలీసులను ఆశ్రయించిన వివాహిత
భర్త అనుమానంతో చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, తను ప్రేమించి యువకుడితోనే నేను సంసారం చేస్తానంటూ ఓ యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్ : మొగుడు వద్దు.. ప్రియుడే ముద్దు అంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్ మెట్టెక్కి వార్తల్లో నిలిచింది. తల్లిదండ్రులు కట్నకానుకులు ఇచ్చి అత్యంత వైభవంగా పెళ్లి జరిపించినా.. ఈ మొగుడు నాకొద్దు.. నా లవర్ బాయే కావాలని ఏకంగా ఏపీ హోంమంత్రికే లెటర్ పెట్టింది ఈ ఇల్లాలు. కాకినాడ జిల్లాలో వెలుగుచూసిన ఈ ప్రేమికురాలి కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామానికి చెందిన కిల్లాడి లీలమాధురికి 2025 నవంబర్ 28 గరవయ్య కోనేరు గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్‌తో వివాహం జరిగింది. అన్నవరం దేవస్థానంలో జరిగిన ఈ పెళ్లికి ముందు ఇరువైపుల నుంచి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి మాట్లాడుకున్న తర్వాత కట్నకానుకల ఇచ్చి తల్లిదండ్రులు వివాహం జరిపించారు. అయితే లీలమాధురి పెళ్లికి ముందే పాడేరుకు చెందిన యువకుడిని ప్రేమించింది. ఆ విషయం తెలిసే తల్లిదండ్రులు ప్రియుడిని కాదని.. మరో యువకుడితో వివాహం జరిపించారు. పెళ్లైన తర్వాత లీలమాధురి తన ప్రేమాయణం గురించి భర్తకు చెప్పింది. దీంతో తనను మోసం చేశారని భార్యను మానసికంగా, శారీరకంగా హింసించడం ప్రారంభించాడు. వాటిని తట్టుకోలేని లీలమాధురి భర్తను వదిలేసి ఇంటినుంచి వెళ్లిపోయింది.
విషయం తెలుసున్న ఆమె తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పి తీసుకొచ్చారు. భార్యభర్తలకు సర్ధిచెప్పి మళ్లీ కాపురానికి పంపించారు. అయితే భర్త మళ్లీ తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, లొంగదీసుకునే ప్రయత్నం చేశాడని, ఆయన కట్టిన తాళితోనే చంపాలని చూశాడని లీలమాధురి ఆరోపణలు చేస్తోంది. ఓసారి తుని రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడా హత్యాయత్నం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. ఈ విషయం తన కుటుంబ సభ్యులకు చెబితే వాళ్లు కూడా అతడితో కాపురం చేయకపోతే మేము చంపేస్తాం అంటున్నారని, ఇంట్లో ఉన్న నన్ను చున్నీతో ఉరి వేశారని తీవ్ర ఆరోపణలు చేసింది.
తనను అనుమానిస్తూ, హింసించే భర్త వద్దని, అతడు అంటే నాకు ఇష్టం లేదని తెగేసి చెబుతుంది. తనను ప్రేమించే ప్రియుడే కావాలని, నేను అతడితోనే కాపురం చేస్తానని తేల్చేసింది. గురువారం ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని, ఆ భర్త, నా కుటుంబ సభ్యులు నన్ను హత్య చేయాలని చూస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఇష్టం లేని భర్త వద్దు.. ప్రేమించిని ప్రియుడే కావాలని, అతడితోనే ఉంటానని, సాటి మహిళగా హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. మరి పోలీసులు, హోంమంత్రి అనిత ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.






