తాడ్వాయిలో వివాహిత ఆత్మహత్య

by Ratna Kumari |

మండల కేంద్రంలో శనివారం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటు చేసుకుంది.

తాడ్వాయిలో వివాహిత ఆత్మహత్య
X

దిశ‌, తాడ్వాయి : మండల కేంద్రంలో శనివారం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై నరేష్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన స్వాతి (35) గత ఆరు నెలలుగా ఆమె తీవ్ర అనారోగ్యం,నిద్రలేమి సమస్యలతో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు పలు ఆసుపత్రుల్లో చూపించి చికిత్స చేయించినప్పటికీ ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన స్వాతి, శనివారం తన నివాసంలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ క్రమంలో మృతురాలు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన ఆరోగ్య సమస్యలు,మానసిక వేదన భరించలేకే జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని ఆమె అందులో పేర్కొన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని ఎస్సై పేర్కొన్నారు. మృతురాలి మరణంపై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు. మృతురాలి తల్లి రాజమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడ్వాయి ఎస్ఐ నరేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఆ వివాహితకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Next Story