గడ్డి మందు తాగి వివాహిత ఆత్మహత్య

by Nallavelli.Anjaneyulu |

గ‌డ్డి మందు తాగి వివాహిత ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న మంద‌మ‌ర్రి ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది.

గడ్డి మందు తాగి వివాహిత ఆత్మహత్య
X

దిశ, మందమర్రి : గ‌డ్డి మందు తాగి వివాహిత ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న మంద‌మ‌ర్రి ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మంద‌మ‌ర్రి ప‌ట్ట‌ణం శ్రీప‌తి న‌గ‌ర్ కు చెందిన పొన్నం శ్రావ‌ణి కి మూడు నెలల కిందట గజ్జెలి రంజిత్ తో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. వృతి రీత్యా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అయిన శ్రావణి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటుంది. భర్త రంజిత్ మంచిర్యాల లోని చైతన్య స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో హైదరాబాద్ కి బదిలీ అయితే ఇద్దరం కలిసి ఉండవచ్చు అనుకునే సమయంలోనే శ్రావ‌ణి మంగళవారం రాత్రి గ‌డ్డి మందు తాగింది. హాస్ట‌ల్ వార్డెన్ సిబ్బంది రంజిత్ కు ఫోన్ చేసి శ్రావణి మందు తాగిన విషయం చెప్పడంతో కంగుతిన్న రంజిత్ హుటాహుటిన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. దీంతో చికిత్స పొందుతూ బుధవారం ఉద‌యం తుది శ్వాస విడిచింది. ఇటీవల పెళ్లి చేసుకున్న నూతన జంట లో విషాదం నెలకొనే సరికి అటూ రంజిత్ కుటుంబంలో ఇటూ శ్రావణి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత పార్థివ దేహాన్ని మందమర్రి లోని స్వస్థలానికి తీసుకొని రాగా.. విషాద ఘటన ఎలా జరిగిందనే పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story