- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఒక వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దిశ, చిట్యాల : కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఒక వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సతీష్ కథనం ప్రకారం.. హన్మకొండ జిల్లా, కమలాపూర్ మండలం, కన్నూరు గ్రామానికి చెందిన బోంత రాములు కుమార్తె గొల్లెన లక్ష్మి (25) కి రేగొండ మండలం రేపక గ్రామానికి చెందిన గొల్లెన హరితో వివాహం జరిగింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం భర్తతో గొడవపడిన లక్ష్మి, తీవ్ర మనస్తాపానికి గురై, అక్కడి నుంచి చిట్యాలలో మెనా మామ ఓర్సు రాజయ్య ఇంటికి వచ్చి, అల్లం తిరుపతి ఎడ్ల కొట్టం వద్ద మందు సేవించింది, గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తరలించే లోపే ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి బొంత రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలికి ఒక కుమారుడు కుమార్తె కలరు.






