- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Marijuana : గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు అరెస్ట్
గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

దిశ, జగిత్యాల టౌన్ : గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ బైపాస్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను పట్టణ సీఐ వేణుగోపాల్ సమక్షంలో పట్టుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జగిత్యాల రూరల్ మండలం బాలేపల్లికి చెందిన జక్కుల మధు, పెగడపల్లి మండలం వెంగళయ్య పేటకు చెందిన రాచర్ల వంశీ, పాలకుర్తి మండలం కుక్కల గూడూరుకు చెందిన నలిమేల వినోద్ కలిసి స్కూటీపై గంజాయి తరలిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు పక్కా సమాచారం మేరకు రాజీవ్ బైపాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి దొరకడంతో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వీరిలో రాచర్ల వంశీ మీద గతంలో రెండు గంజాయి కేసులు, నల్లమల వినోద్ మీద ఏడు కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయని తెలిపారు.






