- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి స్మగ్లింగ్.. అడ్డొస్తే బెదిరించడానికి కత్తులు కొనుగోలు
మంథనిలో 2.023 కేజీల గంజాయిని మంథని పోలీసులు పట్టుకున్నారు.

దిశ,మంథని : మంథనిలో 2.023 కేజీల గంజాయిని మంథని పోలీసులు పట్టుకున్నారు. గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ముగ్గురు యువకులతో పాటు ఇద్దరు మైనర్లు ఆదివారం వారు ఎప్పటిలాగే వారు మంథని మండలంలోని గాడిదుల గండి వద్ద మొత్తం రూపాయలు 21 వెలతో సాయంత్రం బైక్ పై మహారాష్ట్ర లోని తోడ్స గ్రామానికి వెళ్లారు.
అక్కడ విష్ణు వాగ్దే తో పాటు మరో వ్యక్తి దగ్గర నుండి గంజాయితో పాటు వారిని ఎవరైనా అడ్డం వస్తే బెదిరించడానికి రెండు కత్తులను కొనుగోలు చేశారు. విధంగా గంజాయిని మూడు భాగాలుగా చేసి,రెండు నల్లని కవర్లలో,ఒక తెల్లని కవర్ లో వేసి గుడ్డ చుట్టారు.అందులో ఒక నల్లని కవర్ ని ఇద్దరు ఒక గోనె సంచిలో వేసుకొని అందులో ఒక కత్తిని పెట్టుకున్నారు. రెండవ నల్లని కవర్ లో గల గంజాయి ని విమల్ పాన్ మసాలా సంచి లో వేసుకుని తన వద్ద ఉంచుకున్నాడు.
తర్వాత మిగిలిన తెల్లని కవర్ లో గల గంజాయితో పాటు కత్తిని తన కాలేజీ బాగ్ లో పెట్టుకున్నాడు. సోమవారం ఉదయం ఎక్లాస్పూర్ గ్రామ శివారులో గల గాడుదుల గండి వద్దకు వెళ్లి మిగతా స్నేహితుల కోసం ఎదురు చూస్తున్నారు.పక్కా సమాచారంతో మంథని పోలీస్ వారిని పట్టుకున్నారు. గంజాయి విలువ రూ.50,575 ఉంటుందని మోటార్ సైకిల్, రెండు కత్తులు,3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరుగుతుందని ఏసీపీ తెలిపారు.సీఐ, ఎస్ ఐ లు, కానిస్టేబుల్ లు ఉన్నారు.






