- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజాపూర్‌లో మావోయిస్టుల ఘాతుకం.. ఇద్దరు గిరిజనుల హత్య
భద్రతా బలగాలకు మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తున్నారనే నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్య చేసిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా యాంపురం గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ, భద్రాచలం: భద్రతా బలగాలకు మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తున్నారనే నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్య చేసిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా యాంపురం గ్రామంలో చోటుచేసుకుంది. మృతులలో ఒకరు దేవయ్య అలియాస్ సందీప్ మాజీ మావోయిస్టు. ఈ మధ్యనే పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసారు. అయితే మావోయిస్టుల కదలికలు పోలీసులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాడని అతనితో పాటు మరో గ్రామస్తుడిని కూడా మావోయిస్టులు హత్య చేశారు. ఈ సంఘటన గిరిజన గ్రామాలలో భయాందోళన కలిగించింది.
Next Story






