- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెట్టింగ్ యాప్స్‌కు మరో యువకుడు బలి
బెట్టింగ్ యాప్స్ ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. సులువుగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఆశతో అమాయకులు బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి నష్టపోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: బెట్టింగ్ యాప్స్ ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. సులువుగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఆశతో అమాయకులు బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి నష్టపోతున్నారు. చివరికి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది బెట్టింగ్స్ యాప్స్ వల్ల నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యసాయి జిల్లాకు చెందిన జై చంద్ర బెట్టింగ్ యాప్స్ కు అలవాటుపడి డబ్బులు పెట్టాడు. కానీ తీవ్రంగా నష్టాలు రావడంతో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడు తన షర్ట్ పై ఆన్‌లైన్ గేమ్స్, యాప్స్ డౌన్‌లోడ్ చేయవద్దు అని షర్ట్‌పై రాసుకున్నాడు. మృతుడిది పరిగి మండలం పైరేట్ గ్రామంగా గుర్తించారు. బెట్టింగ్ యాప్స్‌తో బాధితుడు తీవ్రంగా నష్టపోయినట్టు సమాచారం. ఇక బెట్టంగ్ యాప్స్ పై ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ మరియు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నవారిపై పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలను పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు కేసులు నమోదు చేసి విచారణ జరిపారు. మరోవైపు మంత్రి నారాలోకేష్ వీటిని నియంత్రించడానికి ఏపీలో ప్రత్యేక చట్టం తీసుకవస్తామని హామీ ఇచ్చారు.






