- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆఫీసర్‌లా కనిపిస్తున్న ఇతను.. చిన్నారిని ఎలా ఎత్తుకెళ్తున్నాడో చూడండి (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: తల్లి చెంతన నిద్రిస్తున్న ఓ చిన్నారిని ఓ వ్యక్తి ఎత్తుకెళ్లిన ఘటన యూపీలోని...Man steals child from mother sleeping at Railway station

దిశ, వెబ్ డెస్క్: తల్లి చెంతన నిద్రిస్తున్న ఓ చిన్నారిని ఓ వ్యక్తి ఎత్తుకెళ్లిన ఘటన యూపీలోని మధుర రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం వెతుకుతున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను విడుదల చేశారు. నిందితుడు ఫొటోను కూడా విడుదల చేశారు. అతడి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే తమకు అందించాలని కోరుతున్నారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... మధుర రైల్వే స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ పై ఏడు నెలల చిన్నారి తన తల్లి చెంతన నిద్రిస్తోంది. ఆ సమయంలో ఓ వ్యక్తిగా అటు ఇటు తిరిగి, అనంతరం ఆ చిన్నారిని ఎత్తుకెళ్లాడు. ఇందుకు సంబంధించి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు బృందాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో రైల్వే స్టేషన్ లో రికార్డైన దృశ్యాలను విడుదల చేశారు. నిందితుడి ఫొటోను కూడా విడుదల చేసి అతనికి సంబంధించిన వివరాలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Also Read : దొంగలు హల్ చల్.. సర్పంచ్ మెడలోని బంగారం చోరీ






