- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియురాలిని కొట్టిన ప్రియుడి ఇల్లు బుల్డోజర్లతో కూల్చివేత
పెళ్లి చేసుకోవాలని అడిగిన ప్రియురాలిని ప్రియుడు చితకబాదిన ప్రియుడి ఇంటిని అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు.

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి చేసుకోవాలని అడిగిన ప్రియురాలిని ప్రియుడు చితకబాదిన ఘటన మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో జరిగిన విషయం తెలిసిందే. యువతి పెళ్లి చేసుకోవాలని పదే పదే అడగడంతో ఆగ్రహానికి గురైన ప్రియుడు ఆమెను కిందపడేసి కాలుతో ఇష్టం వచ్చినట్లు తన్నాడు. ఈ దాడిలో యువతి స్పృహ కోల్పోయింది. దీనికి సంబంధించిన వీడియో కాస్తా వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. తాజాగా నిందితుడి ఇంటిని అక్కడి అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. పదుల సంఖ్యలో నిందితుడి ఇంటికి చేరుకున్న పోలీసులు, ఇతర అధికారులు.. బుల్డోజర్ల సాయంతో మౌగంజ్ ప్రాంతంలోని ధేరా గ్రామంలో ఉన్న నిందితుడి ఇంటిని పూర్తిగా నేలమట్టం చేశారు. నిందితుడి పంకజ్ త్రిపాఠి డ్రైవర్ కాగా.. ఇప్పటికే అతడి లైసెన్స్ ను రద్దు చేశారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక ఎస్సైని సస్పెండ్ చేశారు.






