- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. తనను కొట్టాడని ఫ్రెండ్ ని చంపేసిన యువకుడు
ఇద్దరి మధ్య తలెత్తిన మనస్ఫర్థల కారణంగా.. తనను కొట్టిన స్నేహితుడిని యువకుడు దారుణంగా హతమార్చాడు.

దిశ, వెబ్‌డెస్క్: ఇద్దరి మధ్య తలెత్తిన మనస్ఫర్థల కారణంగా.. తనను కొట్టిన స్నేహితుడిని యువకుడు దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా తణుకు శివారులో జరిగింది. శుక్రవారం అర్థరాత్రి తర్వాత జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
పట్టణ శివారులో ఉన్న డ్రైవర్స్ కాలనీకి చెందిన శిరాళం ప్రభాకర్ (28), కందుల శ్రీను స్నేహితులు. ఇటీవల వీరిద్దరి మధ్య మనస్ఫర్థలు రావడంతో శ్రీనుపై ప్రభాకర్ దాడిచేసి గాయపరిచాడు. దీంతో అవమానంగా ఫీలయిన శ్రీను తన స్నేహితుడితో కలిసి ప్రభాకర్ ను చంపేందుకు ప్లాన్ చేశాడు. శుక్రవారం అర్థరాత్రి తర్వాత ప్రభాకర్ ఇంటికి వెళ్లి దాడి చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






