Pregnant Job' Scam: నన్ను తల్లిని చేస్తే రూ.25 లక్షలు.. మాయ మాటలకు కాంట్రాక్టర్‍కు కుచ్చుటోపీ

by Prasad Jukanti |

నన్ను తల్లిని చేస్తే రూ.25 లక్షలు ఇస్తానని ఓ మహిళ వీడియోను చూసి కాంట్రాక్టర్ దారుణంగా మోసపోయాడు.

Pregnant Job Scam: నన్ను తల్లిని చేస్తే రూ.25 లక్షలు.. మాయ మాటలకు కాంట్రాక్టర్‍కు కుచ్చుటోపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళను గర్భవతి చేస్తే రూ.25 లక్షలు వస్తాయనే ఆఫర్‍కు ఆశపడిన ఓ కాంట్రాక్టర్ సైబర్ నేరగాళ్ల (cyber fraud) వలలో చిక్కి నిండా మునిగాడు. సోషల్ మీడియాలో వచ్చిన ఓ ప్రకటన చూసి అత్యాశకు పోయి లక్షలు పోగొట్టుకున్నాడు. పూణెలో జరిగిన ఈ ఘటనలో ఆశ్చర్యపడే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూణెకు చెందిన 44 ఏళ్ల ఓ కాంట్రాక్టర్ సోషల్ మీడియాలో ప్రెగ్నెన్సీ జాబ్ (Pregnancy job) యాడ్ చూశాడు. ఈ ప్రకటన వీడియోలో ఓ మహిళ హిందీలో మాట్లాడుతూ తనను తల్లిని చేసే వ్యక్తి నాకు కావాలి. నాకు మాతృత్వం ఆనందం ఇచ్చే వ్యక్తికి నేను రూ. 25 లక్షలు ఇస్తాను. అలా నన్ను ప్రెగ్నెంట్ చేసే వ్యక్తి చదువుకున్నా చదువుకోకపోయినా పర్వాలేదు. ఏ కులానికి చెందిన వాడైనా పర్వాలేదు. అతడు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా పర్వాలేదు. నన్ను తల్లిని చేయగలిగితే చాలు అని చెప్పుకొచ్చింది. ఈ వీడియో చూసిన సదరు కాంట్రాక్టర్ ఆ వీడియోలో చూపించిన నంబర్‍కు కాంటాక్ట్ అయ్యారు.

ఆశపడేసరికి..

వీడియోలో పేర్కొన్న నంబర్‍కు ఫోన్ చేయగా అవతలి నుంచి తాను ప్రెగ్నెన్సీ జాబ్ సంస్థలో అసిస్టెంట్ అంటూ మాట్లాడారు. సదరు మహిళను ప్రెగ్నెంట్ చేసేందుకు ఈ జాబ్‍లో కొనసాగాలంటే సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని అందుకోసం రిజిస్ట్రేషన్ చార్జీలు, గుర్తింపు కార్డు చార్జీలు, వెరిఫికేషన్, జీఎస్టీ, టీడీఎస్ ప్రాసెసింగ్ ఫీజులంటూ రకరకాల వసూలు చేశారు. కొన్ని సార్లు వలపుల వలతో మరికొన్ని సార్లు బలవంతంగా ఇలా 100 సార్లు యూపీఐ, ఐఎంపీఎస్ ద్వారా మొత్తం రూ.11 లక్షల వరకు కాజేశారు. ఆ తర్వాత ఆ కాంట్రాక్టర్ జాబ్ గురించి ప్రశ్నలు అడగడం ప్రారంభించగానే సైబర్ మోసగాళ్లు అతన్ని బ్లాక్ చేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఫిర్యాదుదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గత సెప్టెంబర్‍లో జరుగగా తాజాగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Next Story