- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో ఘోరం.. భార్య, ఇద్దరు కూతుర్లను చంపిన వ్యక్తి
వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారని జీవిత భాగస్వాములను, ఆస్తి కోసం తల్లిదండ్రులను, పథకం ప్రకారం అంతమొందిస్తోన్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారని జీవిత భాగస్వాములను, ఆస్తి కోసం తల్లిదండ్రులను, పథకం ప్రకారం అంతమొందిస్తోన్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరమైన సంఘటన వెలుగుచూసింది. నగరంలోని కరవాల్ నగర్ లో ప్రదీప్ అనే వ్యక్తి తన భార్య, 5 , 7 సంవత్సరాల వయసున్న ఇద్దరు కూతుర్లను దారుణంగా హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మూడు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రదీప్ కు, తన భార్య జయశ్రీతో ఓ క్రైమ్ విషయమై జరిగిన గొడవ కారణంగా క్షణికావేశంలో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ప్రస్తుతం ప్రదీప్ పరారీలో ఉండగా.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజాగా జరిగిన ఈ ట్రిపుల్ మర్డర్ సంఘటన గతేడాది డిసెంబర్ లో సౌత్ ఢిల్లీలో జరిగిన తల్లిదండ్రులు, సోదరి హత్య ఘటనను గుర్తు చేసింది. 20 ఏళ్ల అర్జున్ తనను తన తండ్రి తిట్టాడని, అలాగే ఆస్తిని తన సోదరికి ఇవ్వడంతో మనస్తాపం చెంది హత్యలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు.






