- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy : వారసుడి కోసం.. భార్య, కూతుర్లు దారుణ హత్య
ఆడపిల్ల పుడుతుందేమోనన్న భయంతో భార్యను అబార్షన్ చేయించుకోవాలని ఫోర్స్ చేశాడు. ఆమె నిరాకరించడంతో ఇద్దరు కూతుళ్లతో సహా ఆమెనూ చంపేశాడు.

దిశ, వెబ్‌డెస్క్: కనడానికి అమ్మ, పెళ్లికి భార్య కావాలి. కానీ.. తాను పిల్లల్ని కనే విషయంలో మాత్రం కొందరు పురుషులు ఇప్పటికీ తమ ఆలోచనా ధోరణిని మార్చుకోవడం లేదు. సృష్టికి మూలం ఆడది అంటారు.. ఆ ఆడపిల్లల్ని కనేందుకు మాత్రం అస్సలు ఒప్పుకోరు కొందరు. ఇద్దరూ ఆడపిల్లలే పుడితే మూడో కాన్పు లేకుండా ఆపరేషన్ చేయించుకోవాల్సింది పోయి.. వారసుడి కోసం తపించాడు. తీరా చూస్తే.. మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనన్న భయంతో అబార్షన్ చేయించుకోవాలని భార్యపై ఒత్తిడి చేశాడు. ఒప్పుకోకపోవడంతో ఆమెతో పాటు ఇద్దరు కూతుళ్లను నీటిలో తోసేసి చంపేశాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అజారుద్దీన్, ఫర్హాత్ (26) దంపతులకు పెళ్లై ఇద్దరు కూతుర్లు ఉమేరా (8), ఆయేషా (6) ఉన్నారు. అజారుద్దీన్ ఊరి శివారులో వరంగల్ - ఖమ్మం నేషనల్ హైవే పక్కన ఒక స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లల తర్వాత మరో రెండుసార్లు భార్య ప్రెగ్నెంట్ అవ్వగా మళ్లీ ఆడపిల్లలే పుడతారన్న భయంతో అబార్షన్లు చేయించాడు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఫర్హాత్ ప్రెగ్నెంట్ అవ్వగా.. అజారుద్దీన్ ను అదే భయం వెంటాడింది. మళ్లీ అబార్షన్ చేయించుకోవాలని భార్యపై ఒత్తిడి చేయగా ఆమె ఒప్పుకోలేదు. పలుమార్లు గొడవలూ అయ్యాయి.
ఎలాగైనా ఆమెను చంపాలని భావించిన అజారుద్దీన్ బుధవారం (ఏప్రిల్ 1) రాత్రి ఫర్హాన్, ఇద్దరు కూతుర్లను స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లి నీటిలో ముంచి హతమార్చాడు. మర్నాడు ముగ్గురూ ప్రమాదవశాత్తు మరణించారని కుటుంబ సభ్యులకు చెప్పాడు. కానీ ఆమె తండ్రి అలీకి భర్తపై అనుమానం కలిగింది. పోలీసులకు కంప్లైంట్ చేయగా.. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. భార్యలేకుండా పిల్లల్ని పెంచడం కష్టమని భావించి, వారిద్దరిని కూడా చంపేసినట్లు చెప్పాడు. పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అజారుద్దీన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.






