హరియాణాలో దారుణం.. యూట్యూబ్ చూసి అత్త కొడుకును చంపేసిన వ్యక్తి

by Ajay Maddhiboyina |

హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. యూట్యూబ్ చూసి మేనత్తకొడుకునే ఓ వ్యక్తి హత్య చేశాడు. హరియాణాలోని బుసాయి ప్రాంతానికి చెందిన సంజయ్ శర్మ అనే వ్యక్తి తన అత్త డెహ్రాడూన్ కు చెందిన గురుదత్ శర్మ అనే వ్యక్తితో కలిసి పద్నాలుగేళ్ల క్రితం స్టోన్ క్రషర్ వ్యాపారం చేశాడు.

హరియాణాలో దారుణం.. యూట్యూబ్ చూసి అత్త కొడుకును చంపేసిన వ్యక్తి
X

దిశ, వెబ్ డెస్క్: హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. యూట్యూబ్ చూసి మేనత్తకొడుకునే ఓ వ్యక్తి హత్య చేశాడు. హరియాణాలోని బుసాయి ప్రాంతానికి చెందిన సంజయ్ శర్మ అనే వ్యక్తి తన అత్త డెహ్రాడూన్ కు చెందిన గురుదత్ శర్మ అనే వ్యక్తితో కలిసి పద్నాలుగేళ్ల క్రితం స్టోన్ క్రషర్ వ్యాపారం చేశాడు. సంజయ్ కి గురుదత్ శర్మ స్వయానా మేనత్త కొడుకే కావడంతో వీరిద్దరూ కలిసి వ్యాపారం ప్రారంభించారు. అయితే ఇద్దరి మధ్య లావాదేవీలకు సంబంధించిన గొడవలు మొదలవ్వడంతో సంజయ్ పై గురుదత్ కక్ష పెంచుకున్నాడు.

14ఏళ్లు గడిచినా పగ చల్లారకపోవడంతో జనవరి 6న గురుగ్రామ్ లో పక్కా ప్లాన్ ప్రకారం సంజయ్ శర్మను కారుతో గుద్ది ఆ తరవాత తుపాకీతో కాల్చి హత్య చేశాడు. మొదట డెడ్ బాడీ గుర్తించిన పోలీసులు విచారణ జరపగా గురుదత్ శర్మతో పాటు అతడి సహచరుడు అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు. పాత కక్షలతోనే అత్తకొడుకును గురుదత్ శర్మ చంపినట్టు గుర్తించారు. అంతే కాకుండా యూట్యూబ్ చూసి ఈ హత్యకు ప్లాన్ చేయగా నిందితులు హత్య కోసం రూ.10లక్షలు ఖర్చు చేసినట్టు గుర్తించారు.

Next Story