- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేగాం బస్టాండ్ వద్ద ఘోర ప్రమాదం.. బస్సు ఢీ.. శరీరం నుజ్జు నుజ్జు
నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించి ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది.

దిశ, భైంసా : నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించి ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైంసా మండలం వాలేగాం గ్రామానికి చెందిన బోడిగాంవార్ చంద్రశేఖర్(48) తన భార్య సుశీలతో కలిసి బాసరకు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే దేగాo బస్టాండ్లో బస్సుకై ఎదరు చూస్తున్న అక్కడే రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న చంద్రశేఖర్ ను భైంసా నుండి నిజమాబాద్ వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు.
విషయం తెలుసుకున్న కుటుంబీకులు, గ్రామస్తులు దేగం చేరుకొని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.






