కూరగాయల మార్కెట్లో కలకలం.. మృతదేహాన్ని చూసి పరుగులు తీసిన జనం

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-08 05:02:30  IST  )

సూర్యాపేట(Suryapet) జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి కలకలం రేపింది.

కూరగాయల మార్కెట్లో కలకలం.. మృతదేహాన్ని చూసి పరుగులు తీసిన జనం
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట(Suryapet) జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని మార్కెట్‌(Vegetable Market)లో మంగళవారం కూరగాయల కొనేందుకు వెళ్లిన జనానికి మృతదేహం(Man Suspicious Dead) కంటపడటంతో ఒక్కసారిగా పరుగుల తీశారు. వెంటనే విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని మృతుడు.. సూర్యాపేట పట్టణ కోట మైసమ్మ బజారుకు చెందిన కోలా నాగయ్య(43)గా గుర్తించారు. కూరగాయల మార్కెట్లో చికెన్ సెంటర్‌లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నట్లు నిర్ధారించారు. మృతునికి భార్య భవాని, కుమార్తె చైతన్య ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

Next Story