విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

by Ratna Kumari |

దిశ, రాజంపేట : విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన రాజంపేట మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో శుక్రవారం చోటు

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
X

దిశ, రాజంపేట : విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన రాజంపేట మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దాపూర్ గ్రామానికి చెందిన పట్నం గోపాల్(45) తన వ్యవసాయ భూమి వద్ద ప్రమాదవశాత్తు బోరు మోటర్ కి క‌నెక్ష‌న్ ఇచ్చిన స‌ర్వీస్ వైర్ తగిలి విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే కిందపడి మరణించాడు. ఈ ఘటనపై మృత్యుని భార్య పట్నం లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఎస్ఐ రాజు తెలిపారు.

Next Story