ప్రమాదవశాత్తు కుంటలో పడి వ్యక్తి మృతి

by Nallavelli.Anjaneyulu |

ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన వీణవంక మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

ప్రమాదవశాత్తు కుంటలో పడి వ్యక్తి మృతి
X

దిశ, వీణవంక : ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన వీణవంక మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆవుల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. గాజుల రాజేష్(35) అనే వ్యక్తి శనివారం సాయంత్రం తన పొలం వద్దకి వెళ్లాడు. అయితే రాత్రి అయిన తిరిగి ఇంటికి రాకపోయేసరికి తన భార్య పొలం వద్దకి వెళ్లి చూడగా పక్కనే ఉన్న నీటి కుంటలో పడి ఉండటాన్ని గమనించి తమ బంధువులకు సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడికి చేరుకొని రాజేష్ ని బయటకు తీసుకురాగా అప్పటికే చనిపోయాడని మృతుడి భార్య రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు తెలిపారు.

Next Story