- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజాంపేట లో జరిగింది.

దిశ, నిజాంపేట: ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజాంపేట లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నస్కల్ గ్రామానికి చెందిన గంగారపు బుజ్జమ్మ కుటుంబ సభ్యులతో కలసి కొంతకాలంగా నిజాంపేట లో నివాసం ఉంటున్నారు. చిన్న కుమారుడు అశోక్ (21) బుధవారం ఉదయం ప్లాస్టిక్ బాటిళ్లు ఏరడానికి వెళ్లి, వాటిని అమ్ముకోని మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. అనంతరం తన మొబైల్ ఫోన్ ఇంట్లో ఉంచి బయటకు వెళ్లి రాత్రి వరకు రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. గురువారం మధ్యాహ్నం సమయంలో నిజాంపేట శివారులోని గడిం చెరువులో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా, చెరువు ఒడ్డు పై అతని బట్టలు గుర్తించారు. స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించినట్లు గుర్తించారు. ఘటన స్థలానికి ఎస్ఐ రాజేష్ చేరుకొని పరిశీలించి, మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






