ఏపీలో రేబిస్ లక్షణాలతో వ్యక్తి మృతి.. మూడు వ్యాక్సిన్లు వేయించుకున్నా దక్కని ప్రాణం

by Ajay Maddhiboyina |

ఏపీలో రేబిస్ లక్షణాలతో వ్యక్తి మృతి.. మూడు వ్యాక్సిన్లు వేయించుకున్నా దక్కని ప్రాణం
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో దేశంలో రేబిస్ మరణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలో రేబిస్ లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందాడు. విజ‌య‌న‌గ‌రం సంత‌క‌టివి మండ‌లం గోవింద‌పురం గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లింగంనాయుడు అనే వ్య‌క్తిని ఆగ‌స్టు 30న వీధి కుక్క క‌రిచింది. దీంతో పీహెచ్సీలో అత‌డు మూడు వ్యాక్సిన్లు వేయించుకున్నాడు.

అయితే ఇటీవ‌ల అనారోగ్యానికి గుర‌వ్వ‌గా రేబిస్ ల‌క్ష‌ణాలు ఉన్నాయని మెరుగైన చికిత్స కోసం విశాఖ తీసుకువెళ్లాల‌ని వైద్యులు సూచించారు. కాగా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ లింగం నాయుడు క‌న్నుమూశాడు. అయితే ఇప్ప‌టికే వ్యాక్సిన్లు తీసుకున్నా లింగం నాయుడు చ‌నిపోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇక కేర‌ళ‌లోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు కొన్ని నెల‌ల క్రితం చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్న‌ప్ప‌టికీ ముగ్గురు చిన్నారులు మ‌ర‌ణించ‌డం షాకింగ్ గా మారింది. మ‌ర‌ణాలు పెరుగుతుండ‌టంతో వ్యాక్సిన్ల ప‌నితీరుపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Next Story